నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కృష్ణపట్నం క్రాస్‌రోడ్ సమీపంలోని హైవే వంతెనపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడగా, మరో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైవేపై లారీ–ట్రావెల్స్ బస్సు ఢీ.. డ్రైవర్ మృతి