Tuesday, 1 September 2026
  • Home  
  • వికలాంగుల హక్కులు అమలు చేయాలి
- రాజన్న సిరిసిల్ల

వికలాంగుల హక్కులు అమలు చేయాలి

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 31 (పున్నమి ప్రతినిధి) చలో ఖమ్మం సభను విజయవంతం చేయాలని పిలుపు సిరిసిల్ల: సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వికలాంగుల కన్వీనర్‌ శోభారాణి మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్‌ పెంచాలని, ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5 శాతం కేటాయింపు అమలు చేయడంతో పాటు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగుల హక్కులు, సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ 5న జరగనున్న చలో ఖమ్మం కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పంగ శిరీష, ఆవునూరి ప్రభాకర్, లావుడియా వాలియా, ఆవునూరి లచ్చయ్య, సునీత, జ్యోత్స్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 31 (పున్నమి ప్రతినిధి)

చలో ఖమ్మం సభను విజయవంతం చేయాలని పిలుపు

సిరిసిల్ల: సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వికలాంగుల కన్వీనర్‌ శోభారాణి మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్‌ పెంచాలని, ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5 శాతం కేటాయింపు అమలు చేయడంతో పాటు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగుల హక్కులు, సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ 5న జరగనున్న చలో ఖమ్మం కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పంగ శిరీష, ఆవునూరి ప్రభాకర్, లావుడియా వాలియా, ఆవునూరి లచ్చయ్య, సునీత, జ్యోత్స్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.