*వాహనాల తనిఖీలు ముమ్మరం చేసిన ఏన్కూరు పోలీసులు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏన్కూరు పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. మండల పరిధిలోని ప్రధాన రహదారులపై ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలు, వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా SHO , N సంధ్య
మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణ, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు.



