ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
బీజేపీ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.



