అనపర్తి, జూలై 30 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు యండ్రపు శివప్రకాష్తో పాటు వనుం సత్యనారాయణ, గుమ్మడి హరి, గంధం వీరబాబు, కందుకూరి సురేష్ మరియు మరో 15 కుటుంబాలకు టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.



