రాజమహేంద్రవరంలో నిర్వహించిన “CICSE రీజినల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్–2026” అండర్–17 విభాగంలోని 3000 మీటర్ల రన్నింగ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని రాయుడు మోక్షితను రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా మోక్షితను అభినందిస్తూ, క్రీడల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.



