రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో కాజులూరు మండలం ఆండ్రంగి గ్రామానికి చెందిన సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ మంత్రి సుభాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు, పారదర్శక పాలన, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, వనుం వీరబ్రహ్మం, డీసీ పేపకాయల బాబ్జి, గ్రామ టీడీపీ అధ్యక్షులు రాజుబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు మంత్రి సుభాష్ సమక్షంలో 150 మంది వైసీపీ కార్యకర్తల
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో కాజులూరు మండలం ఆండ్రంగి గ్రామానికి చెందిన సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ మంత్రి సుభాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు, పారదర్శక పాలన, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, వనుం వీరబ్రహ్మం, డీసీ పేపకాయల బాబ్జి, గ్రామ టీడీపీ అధ్యక్షులు రాజుబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

