నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. బుడంకుంట జంక్షన్ నుంచి కావలి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు రూ.57 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ముసునూరు మందాటి చెరువు వద్ద రూ.75 లక్షలతో నిర్మించిన తెలుగు తల్లి పార్కును ప్రారంభించి కావలి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మీడియా భవన్ నిర్మాణానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు కావలి పట్టణ ప్రజలు భారీగా హాజరయ్యారు.



