Sunday, 16 August 2026
  • Home  
  • L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: 500 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ
- తిరుపతి

L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: 500 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

నాయుడుపేటలోని L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని స్కూల్ కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్ ఆవిష్కరించగా స్కూల్ ఆవరణంలోపండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆకట్టుకున్న 500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా 500 అడుగుల పొడవైన జాతీయ జెండా నిలిచింది. L.A. సాగరం పాఠశాల ప్రాంగణం నుండి గాంధీ విగ్రహం (గాంధీ బొమ్మ) వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, లతో కలిసి భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పట్టుకున్న భారీ త్రివర్ణ పతాకం నాయుడుపేట వీధుల్లో కన్నులపండువగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు (మాజీ ఎంపీ) నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, ఆయన విద్యార్థినీ విద్యార్థులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ జమీలా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్.ఎం) సుబ్రహ్మణ్యం విశిష్ట పాత్ర పోషించారు. పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్ అసలు గంగ ప్రసాద్ కరీం భాయ్ చెంచయ్య మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

నాయుడుపేటలోని L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని స్కూల్ కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్ ఆవిష్కరించగా స్కూల్ ఆవరణంలోపండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు.
ఆకట్టుకున్న 500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా 500 అడుగుల పొడవైన జాతీయ జెండా నిలిచింది. L.A. సాగరం పాఠశాల ప్రాంగణం నుండి గాంధీ విగ్రహం (గాంధీ బొమ్మ) వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, లతో కలిసి భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పట్టుకున్న భారీ త్రివర్ణ పతాకం నాయుడుపేట వీధుల్లో కన్నులపండువగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
మాజీ పార్లమెంట్ సభ్యులు (మాజీ ఎంపీ) నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, ఆయన విద్యార్థినీ విద్యార్థులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ జమీలా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్.ఎం) సుబ్రహ్మణ్యం విశిష్ట పాత్ర పోషించారు. పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్ అసలు గంగ ప్రసాద్ కరీం భాయ్ చెంచయ్య మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.