Thursday, 10 September 2026

Tag: Maddali

తిరుపతి

స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజలు నిర్వహించారనే ప్రచారంలో వాస్తవం లేదు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నాయుడుపేట. తేదీ: 18-08-2026 – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనంపై నాయుడుపేట పోలీసులు సమగ్ర విచారణ. – దిష్టి పూజ నిర్వహించినట్లు విచారణలో వెల్లడి – క్షుద్ర పూజలు జరిగినట్లు నిర్ధారణ కాలేదు. – వ్యక్తి అనారోగ్యానికి క్షుద్ర పూజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత. – అసత్యాలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు పోలీసుల సూచన. – సున్నితమైన అంశాలను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి. తిరుపతి 18: నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీ సమీపంలో గల స్వర్ణముఖి నదిలో 17-08-2026 రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా కొన్ని సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడుపేట పట్టణ పోలీసులు వెంటనే స్పందించి, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారంపై సమగ్రంగా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, చెన్నై, రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన చిన్నదొరై గణశేఖర్, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన భార్య పద్మావతి. పద్మావతికి నాయుడుపేట ప్రాంతంలో బంధువులు ఉండటంతో, తన భర్తకు ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయనే మూఢనమ్మకంతో, బంధువుల సూచన మేరకు నాయుడుపేట అగ్రహారం ప్రాంతానికి చెందిన కటకం ముత్యాలయ్య అనే వ్యక్తి ద్వారా స్వర్ణముఖి నది వద్ద దిష్టి పూజ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కార్యక్రమంలో భాగంగా దిష్టి తీసే సమయంలో ఒక బొమ్మ/ఆకారం గీసి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేదా నిర్ధారణ పోలీసుల విచారణలో లభించలేదు. అదేవిధంగా, పూజా కార్యక్రమం అనంతరం చిన్నదొరై గణశేఖర్ అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఆయనకు ముందుగానే కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన అస్వస్థతకు గురైన విషయాన్ని క్షుద్ర పూజలతో ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వాస్తవ పరిస్థితులకు భిన్నమైనదిగా పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి సూచనల మేరకు ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించే వదంతులు, నిర్ధారణ కాని సమాచారంపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని వాస్తవమని భావించకుండా సంబంధిత పోలీసు అధికారుల ద్వారా నిజానిజాలను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల దృష్టికి ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, వదంతులను వ్యాప్తి చేయడం కాకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. – మీడియా మిత్రులకు ప్రత్యేక విజ్ఞప్తి. ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్న ఇటువంటి సున్నితమైన అంశాలను ప్రచురించే ముందు సంబంధిత పోలీసు అధికారుల వద్ద వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరడమైనది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్ధారణ కాని కథనాలను యథాతథంగా ప్రచారం చేయకుండా, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

⛔ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

⛔రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవోకి వింత పత్రం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ముందు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఇలప నాగేంద్రబాబులు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతాంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయని ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా సూళ్లూరుపేట రెవెన్యూ డివిషన్లో అనేక రైతాంగ సమస్యలు ఉన్నాయని బుచ్చినాయుడు కండిగ మండలం వి ఎస్ పురం లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వలేదని అలాగే సూళ్లూరుపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో తెలుగు గంగ చీలు కాలువలను పూర్తి చేయాలని, ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెలికితీయాలని కోరారు. దాదాపు 1500 ఎకరాల కు నకిలీ విత్తనాల ద్వారా రైతులు మూడు కోట్ల రూపాయల మేర నష్టపోతే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఇప్పటికీ కూడా వారికి తగిన నష్టపరిహారం అందించలేదని నష్టపోయిన రైతాంగం ఎదురుచూపులు తప్పడం లేదని ఇకనైనా బాధిత రైతాంగానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దురాక్రమణ పాలైన నెర్రి కాలువ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిందని, సాగునీరు ప్రవహించాల్సిన నెర్రి కాలువలో మురుగునీరు ప్రవహిస్తుందని కాలువ ఆక్రమణలను తొలగించి పరిశుభ్రమైన సాగునీటిని రైతన్నలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమణయ్య శ్రీనివాసులు,ఆనంద్ బాబు ఓ కుమార్ బాలు రజిని చంచమ్మ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఉత్తమ రీడర్లకు విద్యుత్ శాఖలో ఘన సత్కారం*

తిరుపతిజిల్లా దొరవారిసత్రం: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా దొరవారిసత్రంమండలానికి చెందిన ఎంపీఈవో వల్లిపి గ్రేస్ సముచిత గౌరవాన్ని అందుకున్నారు. గత 11 సంవత్సరాలుగా అనగా 2015 నుండి 2026వరకు ఆమె అందించిన నిరుపమాన సేవలను గుర్తిస్తూ, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావ్ గారి చేతులమీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక “ఉత్తమ ఎంపీఈవో” పురస్కారాన్ని స్వీకరించారు. *నిబద్ధతకు దక్కిన సముచిత గౌరవం:* వల్లిపి గ్రేస్ అందుకున్న ఈ అవార్డు కేవలం ఒక ప్రశంసాపత్రం మాత్రమే కాదు.క్షేత్రస్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దశాబ్ద కాలానికి పైగా చూపిన నిరంతర శ్రమకు, నిలకడైన నిబద్ధతకు దక్కిన ఘన సత్కారం. 2015లో విధి నిర్వహణలో చేరిన నాటి నుండి నేటి వరకు ఆమె ప్రస్థానం ఎంతో స్పూర్తిదాయకం. సచివాలయ వ్యవస్థ రాకముందు ఆమె దొరవారిసత్రం మండలమంతా విస్తృతంగా పనిచేసి రైతాంగానికి అండగా నిలిచారు. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన కొత్తలో కొత్తపల్లి సచివాలయ పరిధిలో తన మార్కు సేవలను అందించారు. ప్రస్తుతం నెలబల్లి సచివాలయంలో ఎంపీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు సాంకేతిక, నైతిక మద్దతును అందిస్తూవస్తున్నారు.ఒక ఎంపీఈవోగా కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రతి చేనుకూ వెళ్ళి రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో ఆమె చూపిన చొరవ అమోఘం. విత్తన శుద్ధి, చీడపీడల నివారణ, ఈ-క్రాప్ బుకింగ్ వంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు ను ప్రతి రైతుకూ పారదర్శకంగా చేర్చడంలో ఆమె అత్యంత కీలక పాత్ర పోషించారు.సాధారణ విధులతో పాటు రైతుల కోసం ప్రత్యేక క్యాంపైన్‌లను ఏర్పాటు చేసి, వారిని నేరుగా వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు తీసుకెళ్ళి అక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికతపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడంలో ఆమె చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం.తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో, జిల్లా ఉన్నతాధికారులు మరియు వేలాది మంది ప్రజల సమక్షంలో జిల్లా వ్యవసాయ అధికారి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకోవడం దొరవారిసత్రం మండలానికే గర్వకారణం. విధి నిర్వహణలో అలసత్వం వహించే ఎంతోమందికి వల్లిపి గ్రేస్ ఒక దిక్సూచిలా, రోల్ మోడల్‌గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

తిరుపతి

L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: 500 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

నాయుడుపేటలోని L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని స్కూల్ కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్ ఆవిష్కరించగా స్కూల్ ఆవరణంలోపండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆకట్టుకున్న 500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా 500 అడుగుల పొడవైన జాతీయ జెండా నిలిచింది. L.A. సాగరం పాఠశాల ప్రాంగణం నుండి గాంధీ విగ్రహం (గాంధీ బొమ్మ) వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, లతో కలిసి భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పట్టుకున్న భారీ త్రివర్ణ పతాకం నాయుడుపేట వీధుల్లో కన్నులపండువగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు (మాజీ ఎంపీ) నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, ఆయన విద్యార్థినీ విద్యార్థులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ జమీలా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్.ఎం) సుబ్రహ్మణ్యం విశిష్ట పాత్ర పోషించారు. పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్ అసలు గంగ ప్రసాద్ కరీం భాయ్ చెంచయ్య మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

తిరుపతి

శ్రీధనమల్లి లో ఘనంగా ‘డోర్ టూ డోర్’ ప్రజా చైతన్య కార్యక్రమం*

*మాజీ సర్పంచ్ పురుషోత్తం మరియు గ్రామ టీడీపీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో’డోర్ టూ డోర్’* దొరవారిసత్రం, (శ్రీధనమల్లి) *తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేరవేసే లక్ష్యంతో దొరవారిసత్రం మండలం పరిధిలోని శ్రీధనమల్లి పంచాయతీ నందు మాజీ సర్పంచ్ పురుషోత్తం మరియు గ్రామ టీడీపీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మరియు 183 పిట్టి రమణయ్య ఆధ్వర్యంలో’డోర్ టూ డోర్’ (ఇంటింటికీ తెలుగుదేశం) కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.ఇందులో భాగంగా, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ విశేష చొరవ మరియు మార్గదర్శకత్వంలో, దొరవారిసత్రం మండలం శ్రీధనమల్లి పంచాయతీ పరిధిలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు సారథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.* *కార్యక్రమ విశేషాలు:* *గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమంలో గత రెండేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించారు.* *ప్రజల నుంచి అపూర్వ స్పందన: ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై హర్షం వ్యక్తం చేశారు.* *సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్న తీరును ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.* *భాగస్వామ్య నాయకులు: ఈ కార్యక్రమంలో శ్రీధనమల్లి పంచాయతీ పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, బూత్ స్థాయి కన్వీనర్లు, ఎంపీటీసీలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.* *”ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యుల సహకారంతో నిరంతరం శ్రమిస్తున్నాం. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరడమే మన ప్రభుత్వ అసలైన విజయమని,”ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.* *ఈ కార్యక్రమం ద్వారా శ్రీధనమల్లి పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొనగా, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.*

తిరుపతి

⛔కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి మరో వ్యక్తికి గాయాలు

📌తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కడపట్ర పంచాయతీ తోటకట్ల గ్రామానికి చెందిన కత్తి నాగరాజు విద్యుత్ షాక్ ప్రమాదానికి గురిఅయి చనిపోయాడు. 📌మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 📌రోజులాగే బాబూజీ కాలనీలో సెంట్రింగ్ పనికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇనప రాడ్లను కట్ చేసి మిద్దె పైకి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు(11 కె వి) తగిలి నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. 📌రెంటమల్లు శశి అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 📌విషయం తెలుసుకున్న ఎస్ఐ అజయ్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 📌ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

తిరుపతి

ఉత్తమ రీడర్లకు విద్యుత్ శాఖలో ఘన సత్కారం*

*సూళ్లూరుపేట, ఆగస్టు 13 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన రీడర్లను ఘనంగా సత్కరించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, విద్యుత్ బిల్లుల రీడింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రీడర్ల సేవలను గుర్తించి వారికి షీల్డ్లను బహూకరించారు. ఏఈ శేఖర్, జేఏఓ మనయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రీడర్లను అభినందించారు. విద్యుత్ శాఖలో రీడర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి నెలా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడంతో పాటు బిల్లింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు వినియోగదారులకు మధ్య రీడర్లు కీలక వారధిగా పనిచేస్తున్నారని, ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని కార్యక్రమంలో ప్రశంసించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన పనితీరును కనబరిచిన సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా షీల్డ్లు అందుకోవడం రీడర్లలో ఆనందాన్ని కలిగించింది. తమ సేవలను గుర్తించి ప్రోత్సహించిన విద్యుత్ శాఖ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి ఏఈలు, జేఈలు, లైన్మెన్లు, రీడర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

*జ్ఞానజ్యోతి శిక్షణ ట్రైనింగ్ క్లాసులు,శిక్షణ కార్యక్రమం జి.ఎం.ఎన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ చిట్టమూరు,*

చిట్టమూరు: కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం చిట్టమూరు జీఎంఎన్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఇన్‌చార్జి ఎంపీడీవో విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, పోషకాహార కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతల సంరక్షణ వంటి అంశాలపై కార్యకర్తలు అవగాహనతో పనిచేయాలని సూచించారు. జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లలలో అభ్యసన సామర్థ్యాల పెంపు, పోషకాహార ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు వేదికలుగా నిలిచేలా కార్యకర్తలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణలో చురుగ్గా పాల్గొని వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు ఎంపీడీవో భూపయ్య,సూపర్వైజర్ కవిత, రీసెర్చ్ పర్సన్ బాస్కర్, వేణు , అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అక్రమంగా పశువులను తరలిస్తున్న సంత పై కొరడా జులిపించిన డీ ఎస్ పి చెంచుబాబు*

*అక్రమంగా పశువులను తరలిస్తున్న సంత పై కొరడా జులిపించిన డీ ఎస్ పి చెంచుబాబు* పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 11-08-26 ఈరోజు నాయుడుపేట శ్రీ డి.ఎస్.పి చెంచు బాబు గారు దొరవారి సత్రం కుప్పారెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి సంతను తనిఖీ చేసి సంత నిర్వాహకులకు ఇచ్చుట ఎలాంటి ఆవులను రవాణా చేయుట మరియు నిల్వ ఉంచుట చేయరాదు అని హెచ్చరించడమైనది అట్లు చేసిన యెడల వారిపై కఠినమైన చర్యలు తీసుకొనబడునని ఆదేశించడం అయినది కావున ఎవరు కూడా ఆవులను రవాణా చేయుట చేయకూడదని సూచించడమైనది.అట్లు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పశువుల సంత నడిపితే కేసులు నమోదుచేసి చర్యలు చెపడతామని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.