ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 31 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కాగితాలపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మతిస్థిమితం లేని 35 ఏళ్ల మహిళపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి ఘటన కలకలం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 31 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కాగితాలపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మతిస్థిమితం లేని 35 ఏళ్ల మహిళపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

