మళ్లీ జగనన్నను సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధం
-చంద్రగిరి నుంచే మొదలవుతుంది: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
రామచంద్రపురం సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రామచంద్రాపురం మండలం నెన్నూరు, సూరావారిపల్లి గ్రామాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆ వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని మహానేత విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. ముందుగా నెన్నూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు అందరికీ అల్పాహారం పంపిణీ చేశారు. ఆ తరువాత సూరావారిపల్లిలో పచ్చటి పందిరి కింద కొలువైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి ఆ మహానేత మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం భారతదేశానికి తీరని లోటన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలతో అధికారంలోకి వచ్చిన రాజన్న వారసుడు జగనన్న గత ఐదేళ్లలో ప్రజలకు అన్న విర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందించారని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంక్షేమాన్ని ప్రజలకు దూరం చేసిందని విమర్శించారు. ప్రజలు తాము మోసపోయామని తెలుసుకున్నారని, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ మార్పు చంద్రగిరి నుంచే ప్రారంభమవుతుందని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలు, జగనన్న సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత వర్ధంతి సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అల్పాహారం పంపిణీ చేసి గ్రామస్తులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలుకరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ ఏ.వి. బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వి. భాను కుమార్ రెడ్డి, రాష్ట్ర మేధావుల ఫారం సెక్రటరీ రమేష్ రెడ్డి, రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు మురగయ్య, జిల్లా రైతు విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గురు స్వామి, నియోజకవర్గ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గోపి చౌదరి, జిల్లా మేధావుల విభాగం ఎగ్జిక్యూటివ్ నెంబర్ చిట్టి బాబు, మండల మహిళా అధ్యక్షురాలు జ్యోతి, మండల బీసీ సెల్ అధ్యక్షులు కుప్పం భాస్కర్ యాదవ్ , మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ , మండల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి , మండల నాయకులు పెరుమాళ్ రెడ్డి, వెంకట రెడ్డి, M. భాస్కర్ రెడ్డి,శంకర్ రెడ్డి, హిమాల్ రెడ్డి, చిరంజీవులు నాయుడు , కేశవులు రెడ్డి, మొగిలి రెడ్డి, మారయ్య, గోవర్ధన్, సుధాకర్, నరేష్, శంకర్, అశోక్,మురళి, సాయి, ప్రతాప్, రవి,భాస్కర్, సుబ్రమణ్యం పంచాయతీ అధ్యక్షులు కేశవులు రెడ్డి, గంగ రామయ్య, మహేంద్ర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జానకిరామయ్య , రాజేష్ , భాస్కర్ రెడ్డి, మురళీ రెడ్డి, వాసుదేవ రెడ్డి, డిల్లీ , భూపతి రెడ్డి, చంద్ర, కుమార్, గిరి, మణి , మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు



