ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఫుడ్ సేఫ్టీ ఇన్చార్జి అధికారి ఈ. శరత్ ఆధ్వర్యంలో FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించారు. మేళాకు 80 మంది వ్యాపారులు హాజరుకాగా, 68 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో 52 దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, అర్హత పొందిన 38 మంది వ్యాపారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ ఆహార వ్యాపారులు తప్పనిసరిగా FSSAI నిబంధనలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేలా వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.



