శ్రీకాళహస్తి, మే 06 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తనకు నిజమైన సంతృప్తినిస్తుందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విన్నపాల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి వినతులను స్వీకరించారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గత పాలనలో నిర్లక్ష్యంతో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందే వరకు కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆశీస్సులే తనకు బలమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి