*దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కర్మ సందర్భంగా నిర్వహించనున్న సంస్మరణ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పరిశీలించారు*.
*ఈ నెల 9, 10 తేదీల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం సంస్మరణ సభలో పాల్గొననున్న నేపథ్యంలో, నేడు నల్లబెల్లి మండలంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాసం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పరిశీలించారు*.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


