Tuesday, 14 July 2026
  • Home  
  • పాప వైద్యానికి అండగా ఖమ్మం బాలయ్య అభిమానులు.. రూ. 1 లక్ష ఇరవై వేలు రూపాయిలు ఆర్థిక సాయం
- ఖమ్మం

పాప వైద్యానికి అండగా ఖమ్మం బాలయ్య అభిమానులు.. రూ. 1 లక్ష ఇరవై వేలు రూపాయిలు ఆర్థిక సాయం

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) కారేపల్లి, ఖమ్మం జిల్లా: ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇనుప గేట్ మీద పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి అంబడి పూడి తన్మయికి ఖమ్మం బాలయ్య అభిమానులు ఆపన్నహస్తం అందించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన అంబడి పూడి తన్మయి ఆడుకుంటున్న సమయంలో సుమారు 40 కిలోల బరువు గల ఇనుప గేట్ చిన్నారి పై పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తన్మయిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్సకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు నల్లమల్ల రంజిత్ తన స్నేహితులతో కలిసి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు రంజిత్ మరియు ఆయన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన వారిని పలువురు అభినందించారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

కారేపల్లి, ఖమ్మం జిల్లా:
ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇనుప గేట్ మీద పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి అంబడి పూడి తన్మయికి ఖమ్మం బాలయ్య అభిమానులు ఆపన్నహస్తం అందించారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన అంబడి పూడి తన్మయి ఆడుకుంటున్న సమయంలో సుమారు 40 కిలోల బరువు గల ఇనుప గేట్ చిన్నారి పై పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తన్మయిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్సకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు నల్లమల్ల రంజిత్ తన స్నేహితులతో కలిసి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు రంజిత్ మరియు ఆయన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన వారిని పలువురు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.