Friday, 24 July 2026
  • Home  
  • నీట్ లీకేజీపై ఆగ్రహం.. జూలై 24 విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు
- రాజన్న సిరిసిల్ల

నీట్ లీకేజీపై ఆగ్రహం.. జూలై 24 విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జులై 23 (పున్నమి ప్రతినిధి) నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీంతో దేశ యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆరోపించారు. విద్యార్థులు న్యాయం కోసం చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడం, లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్, ప్రతిపక్ష ఎంపీల అరెస్టులను ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ బంద్‌కు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జులై 23 (పున్నమి ప్రతినిధి)

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీంతో దేశ యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆరోపించారు. విద్యార్థులు న్యాయం కోసం చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడం, లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్, ప్రతిపక్ష ఎంపీల అరెస్టులను ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ బంద్‌కు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.