పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జూలై 23 చిట్టమూరు మండలం,
వాకాడు మండల పరిధిలోని వాకాడు గొల్లపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను ఎంపీడీవో సాయిప్రసాద్ అకస్మికంగా తనిఖీ చేశారు.
రికార్డులను పరిశీలించి, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.
అంగన్వాడి కేంద్రంలో పంపిణీ చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలన చేసి వారికి తగు చర్యలు గురించి తెలియజేశారు.
ఎంపీడీవోతో డిప్యూటీ ఎంపీడీవో దేవదానం ఉన్నారు.

