నంద్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు.జిల్లాలో ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ఇప్పటికే 85 శాతం పూర్తయిందని, మిగిలిన పనిని ఈ వారంలోనే ముగిస్తామని చెప్పారు. ఫారమ్‌లు 6, 7, 8లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 14 వేల దరఖాస్తులను, ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బిఎల్‌ఓ కాల్‌బుక్, ఎన్‌జీఎస్‌పీ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పూర్తిస్థాయి పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు.

నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ సవరణలు పూర్తి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా