Lవేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం
పున్నమి ప్రతినిధి
కాగజ్‌నగర్ | ఆగస్టు 5, 2026
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 39వ నవోదయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రులు, పాఠశాల, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్సీ దండే విఠల్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



