పొగాకు (FCV Tobacco) రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, చారిత్రాత్మక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నదాతలను ఆదుకుంటున్న తీరు:
* *రూ. 250 కోట్లతో ప్రత్యేక రుణ పథకం:* రాష్ట్రంలోని సుమారు 45,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూర్చేలా ఒక్కో రైతుకు రూ. 50,000 వరకు సున్నా వడ్డీ రుణం అందించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది.
* *కిలోకు రూ. 20 ఆర్థిక సహాయం:* ధర లోటు భర్తీ కింద కిలోకు రూ. 20 చొప్పున అదనపు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏకంగా రూ. 188 కోట్లు భరిస్తున్నాయి.
జగన్ గారి పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? రైతులకు ప్రభుత్వం అండగా నిలబడి, ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో… మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నేడు చేపడుతున్న పర్యటన రైతుల సంక్షేమం కోసం కాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి కాదు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని వారు, ఇప్పుడు ప్రభుత్వం మంచి చేస్తుంటే ఓర్వలేక కేవలం రాజకీయాలు చేసేందుకే బయలుదేరారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇలాంటి డ్రామాలతో ఏమీ చేయలేరు!


