Saturday, 5 September 2026
  • Home  
  • దిండి–చించినాడ బ్రిడ్జిపై విషాద ఘటన – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకినట్లు సమాచారం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దిండి–చించినాడ బ్రిడ్జిపై విషాద ఘటన – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకినట్లు సమాచారం

సెప్టెంబర్ 05 2026 అంబేద్కర్ కోనసీమ జిల్లా.. దిండి–చించినాడ బ్రిడ్జిపై శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు గోదావరిలోకి దూకినట్లు సమాచారం. వీరిని నంబూరి శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని, కుమారుడు, కుమార్తెగా గుర్తించారు. ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మినిని స్థానిక మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తొలుత పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తణుకుకు తరలించారు. శ్రీనివాస్‌తో పాటు కుమారుడు, కుమార్తె గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం పోలీసులు, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సెప్టెంబర్ 05 2026
అంబేద్కర్ కోనసీమ జిల్లా.. దిండి–చించినాడ బ్రిడ్జిపై శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు గోదావరిలోకి దూకినట్లు సమాచారం.

వీరిని నంబూరి శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని, కుమారుడు, కుమార్తెగా గుర్తించారు.

ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మినిని స్థానిక మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తొలుత పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తణుకుకు తరలించారు.

శ్రీనివాస్‌తో పాటు కుమారుడు, కుమార్తె గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం పోలీసులు, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులే ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.