Saturday, 5 September 2026
  • Home  
  • మిదిపేంట్లలో ప్రత్యేక గ్రామ సభ SC, ST, BC ఓటర్ల వివరాలపై ప్రజలకు అవగాహన
- కడప

మిదిపేంట్లలో ప్రత్యేక గ్రామ సభ SC, ST, BC ఓటర్ల వివరాలపై ప్రజలకు అవగాహన

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 05) వేముల: వేముల మండలం మిదిపేంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ శ్రీమతి మద్దూరు శారదమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఓటర్ల జాబితాలో గుర్తించిన SC, ST, BC వర్గాలకు చెందిన ఓటర్ల వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో వర్గాల వారీగా నమోదైన వివరాల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిశీలన అనంతరం అవసరమైన సవరణలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో PDO, అంగన్‌వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ సభ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 05)
వేముల: వేముల మండలం మిదిపేంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ శ్రీమతి మద్దూరు శారదమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఓటర్ల జాబితాలో గుర్తించిన SC, ST, BC వర్గాలకు చెందిన ఓటర్ల వివరాలను ప్రజలకు చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో వర్గాల వారీగా నమోదైన వివరాల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిశీలన అనంతరం అవసరమైన సవరణలు చేపడతామని తెలిపారు.

కార్యక్రమంలో PDO, అంగన్‌వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ సభ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.