శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): తిరుపతి పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యవర్గ (సీడబ్ల్యూసీ) సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజుకు తిరుపతి విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం దిశగా కాంగ్రెస్ పార్టీ మరింత చురుకుగా పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు నాగరాజు, మహేష్, అరుణ్, చరణ్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి విమానాశ్రయంలో గిడుగు రుద్రరాజుకు ఘన స్వాగతం