వేముల మండలం స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జయచంద్ర తో డ్వాక్రా రుణాల మంజూరు పైన సంయుక్త సమావేశాన్ని నిర్వహించిన వెలుగు డిఆర్డిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి డ్వాక్రా సంఘానికి రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.వార్షిక రుణ మరియు జీవనోపాధి ప్రణాళికకు అనుగుణంగా మహిళా సంఘ సభ్యులకి తక్షణమే రుణాలు మంజూరు చేయాలని క్షేత్రస్థాయిలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు డాక్యుమెంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేస్తారని వివరించారు. మహిళా సంఘ సభ్యులు వ్యక్తిగత రుణాలు మంజూరులో ప్రతి బ్యాంకరు లక్ష్యం పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ జ్యోతి జైపాల్ నాగేశ్వరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు






