Monday, 25 May 2026
  • Home  
  • రాజకీయ బంధాలను దాటిన స్నేహం.. ఎమ్మెల్యే ఇంట కేంద్ర మంత్రి ఆత్మీయ విందు
- తిరుపతి

రాజకీయ బంధాలను దాటిన స్నేహం.. ఎమ్మెల్యే ఇంట కేంద్ర మంత్రి ఆత్మీయ విందు

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగృహానికి విచ్చేశారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న కేంద్ర మంత్రికి సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా తమ మధ్య ఉన్న సుదీర్ఘ కాలపు అనుబంధం, మిత్రత్వం ఎంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విందు భోజనంలో కేంద్ర మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొని ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం వారు పాత మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆత్మీయంగా, సరదాగా కాసేపు సమయం గడిపారు. ఎంతో బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి, తన ఇంటికి విచ్చేసి ఆత్మీయతను చాటుకున్న ప్రియ మిత్రుడు రామ్మోహన్ నాయుడికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.