పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి జన సైనికుడు అభిమాని కదలిరావాలి గాలిపెల్లి కుమార్ పిలుపు
పిఠాపురంలో ఈనెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం జనసైనికులు, అభిమానులు భారీగా కదలి రావాలని జనసేన భవిష్యత్తును తట్టిలేపే ఈ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని సమాజ సేవకులు మెగా డిజిటల్ టీం కరీంనగర్ అధ్యక్షుడు గాలిపెల్లి కుమార్ పిలుపునిచ్చారు. పార్టీకి ఐలం చేకూర్చాలంటే ప్రతి కార్యకర్త, అభిమాని ముందుకు రావాలని జనసేన పార్టీ ప్రజల భవిష్యత్తు కోసం, మార్పు కోసం పోరాడుతోందని ఆ పోరాటంలో ప్రతి జన సైనికుడు భాగస్వామి కావాలని గాలిపెల్లి కుమార్ హితవు పలికారు. “ఇది కేవలం ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు, జనసేన బలాన్ని, మన అంకితభావాన్ని నిరూపించే వేదికని పసుపులేటి రాము అన్నారు. వెనుకడుగు వేసే అవకాశం లేదని ప్రతి కార్యకర్త, అభిమాని ఓ సైన్యం లా పిఠాపురం వైపు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఛలో పిఠాపురం మహాసభలో పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని అందుకే ఒక్కొక్కరుగా కాకుండా వేలాదిగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరావాలని పసుపులేటి రాము సూచించారు. ఈ సభను అఖండ విజయంగా మలిచి జనసేన శక్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. జనసేన అధినేత “పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నూతన రాజకీయ మార్గం సిద్ధమవుతోందని ఆ మార్పుకు మనం భాగస్వాములం కావాలని ఛలో పిఠాపురం మహాసభకు హాజరై జనసేన గళాన్ని మరింత బలంగా మార్చాలని గాలిపెల్లి కుమార్ స్పష్టం చేశారు.