Thursday, 3 September 2026
  • Home  
  • గిరిజన సమస్యలు పరిష్కరించాలి
- BHADRADRI

గిరిజన సమస్యలు పరిష్కరించాలి

భద్రాచలం: గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ సేవాలాల్‌ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్‌ బానోత్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, 1/70, పీసా చట్టాల ప్రకారం స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఐటీసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు స్థానిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సేవాలాల్‌ విద్యార్థి సేన నాయకులు హెచ్చరించారు.

భద్రాచలం: గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ సేవాలాల్‌ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్‌ బానోత్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, 1/70, పీసా చట్టాల ప్రకారం స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఐటీసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు స్థానిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సేవాలాల్‌ విద్యార్థి సేన నాయకులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.