Saturday, 8 August 2026
  • Home  
  • గంగపట్నం చంద్రశేఖరయ్యకు చెంచలబాబు యాదవ్ ఘన నివాళి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గంగపట్నం చంద్రశేఖరయ్యకు చెంచలబాబు యాదవ్ ఘన నివాళి

సంగం మండలం జంగాల కండ్రిక గ్రామంలో గంగపట్నం చంద్రశేఖరయ్యకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నాయకులు చెంచలబాబు యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. చంద్రశేఖరయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం చంద్రశేఖరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన చెంచలబాబు యాదవ్.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపట్నం చంద్రశేఖరయ్య సంగం మండలంతో పాటు నెల్లూరు జిల్లాలో బీసీ నాయకుడిగా మంచి పేరు, ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి అని కొనియాడారు.ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ, బీసీల అభ్యున్నతి కోసం తనవంతు కృషి చేసిన చంద్రశేఖరయ్య మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలు, ప్రజలతో ఉన్న అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెంచలబాబు యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో సంగం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొని చంద్రశేఖరయ్యకు నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.