కడప జిల్లా నందలూరు మండలం గొల్లపల్లి, అరవపల్లి గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు యల్లటూరు శ్రీనివాసరాజును ఘనంగా సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


