Friday, 10 July 2026
  • Home  
  • కూటమి ప్రభుత్వంలో బీసీ గురుకులాలు, హాస్టళ్లు విద్యార్థులకు ‘సొంతిళ్లు’ లాంటివి: 10 శాతం డైట్ ఛార్జీల పెంపు, రూ.500 కోట్ల సాస్కి నిధుల కేటాయింపుపై హర్షం* *• బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట* *• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి*
- విజయనగరం 

కూటమి ప్రభుత్వంలో బీసీ గురుకులాలు, హాస్టళ్లు విద్యార్థులకు ‘సొంతిళ్లు’ లాంటివి: 10 శాతం డైట్ ఛార్జీల పెంపు, రూ.500 కోట్ల సాస్కి నిధుల కేటాయింపుపై హర్షం* *• బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట* *• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి*

కూటమి ప్రభుత్వంలో బీసీ గురుకులాలు, హాస్టళ్లు విద్యార్థులకు ‘సొంతిళ్లు’ లాంటివి, 10 శాతం డైట్ ఛార్జీల పెంపు, రూ.500 కోట్ల సాస్కి నిధుల కేటాయింపుపై హర్షం* బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమారి* విజయనగరం జిల్లా రిపోర్టర్/ రమణ, జూలై 10. (పున్నమి) అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులను 10 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఎస్.కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబాఫూలే) స్కూళ్ల శాశ్వత భవన నిర్మాణాలకు రూ.500 కోట్ల సాస్కి (SASCI) నిధులు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామన్నారు. బీసీ బిడ్డల చదువు పట్ల, వారి భవిష్యత్తు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి ఉన్న చిత్తశుద్ధికి ఈ డైట్ ఛార్జీల పెంపు, నిధుల మంజూరే నిదర్శనమని ఆమె కొనియాడారు. సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతమున్న డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ నిర్ణయం వల్ల హాస్టల్ విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసి, బీసీ విద్యార్థుల పట్ల తమకున్న ప్రేమను చాటుకుందని లలిత కుమారి గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్ది కాలంలోనే ఆరు ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారని, కొత్తగా పది గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని ఎమ్మెల్యే లలిత కుమారి వివరించారు. ఇప్పుడు వీటికి శాశ్వత భవనాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏకంగా రూ.500 కోట్ల సాస్కి నిధుల మంజూరుకు ఆదేశించడం పట్ల నియోజకవర్గ బీసీ బిడ్డల తరఫున సీఎం చంద్రబాబు కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం మన బీసీ గురుకులాల్లో సొంతింటి కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ఇప్పటికే ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. బీసీ బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారని, విద్యార్థులంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోళ్ల లలిత కుమారి ఆకాంక్షించారు.

కూటమి ప్రభుత్వంలో బీసీ గురుకులాలు, హాస్టళ్లు విద్యార్థులకు ‘సొంతిళ్లు’ లాంటివి,
10 శాతం డైట్ ఛార్జీల పెంపు, రూ.500 కోట్ల సాస్కి నిధుల కేటాయింపుపై హర్షం*
బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమారి*

విజయనగరం జిల్లా రిపోర్టర్/ రమణ, జూలై 10. (పున్నమి)

అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులను 10 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఎస్.కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబాఫూలే) స్కూళ్ల శాశ్వత భవన నిర్మాణాలకు రూ.500 కోట్ల సాస్కి (SASCI) నిధులు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామన్నారు. బీసీ బిడ్డల చదువు పట్ల, వారి భవిష్యత్తు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి ఉన్న చిత్తశుద్ధికి ఈ డైట్ ఛార్జీల పెంపు, నిధుల మంజూరే నిదర్శనమని ఆమె కొనియాడారు.

సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతమున్న డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ నిర్ణయం వల్ల హాస్టల్ విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసి, బీసీ విద్యార్థుల పట్ల తమకున్న ప్రేమను చాటుకుందని లలిత కుమారి గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్ది కాలంలోనే ఆరు ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారని, కొత్తగా పది గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని ఎమ్మెల్యే లలిత కుమారి వివరించారు. ఇప్పుడు వీటికి శాశ్వత భవనాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏకంగా రూ.500 కోట్ల సాస్కి నిధుల మంజూరుకు ఆదేశించడం పట్ల నియోజకవర్గ బీసీ బిడ్డల తరఫున సీఎం చంద్రబాబు కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం మన బీసీ గురుకులాల్లో సొంతింటి కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ఇప్పటికే ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. బీసీ బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారని, విద్యార్థులంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోళ్ల లలిత కుమారి ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.