పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
అనకాపల్లి: వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, స్థానిక ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ పీలా రవి.మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి. శేషు కుమార్, కోశాధికారి పల్లా త్రినాథ్, అనకాపల్లి సిటీ అధ్యక్షులు పార్థసారథి, కార్యదర్శి ఎన్. లక్ష్మీనారాయణ, కోశాధికారి ఎస్. ప్రసాద్, మాడుగుల తాలూకా అధ్యక్షులు నాని, ఎన్జీవో అసోసియేషన్ నాయకులు, స్థానిక 83వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొద్ధపు ప్రసాద్, లక్ష్మీదేవిపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.


