యలమంచిలి :పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎపిఎన్ జిసి, అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు యలమంచిలి పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మట్టి గణపతి విగ్రహాల తయారీ, వాటి విశిష్టతపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పును ఉపాధ్యాయులు వివరించారు. రసాయన రంగుల వల్ల భూమి, జలాలు ఏ విధంగా కలుషితమవుతాయో విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మట్టి గణపతి ప్రతిమలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తాము తయారు చేసిన మట్టి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేస్తూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను విడిచిపెట్టి పర్యావరణహిత మట్టి వినాయకులను పూజించాలని తల్లిదండ్రులకు, స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మంగపతి, కుందూరు రాజు, కిషోర్ కుమార్, రాజేశ్వరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


