Tuesday, 2 June 2026
  • Home  
  • ఏన్కూరు మండలంలో గాలి వానలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది*
- ఖమ్మం

ఏన్కూరు మండలంలో గాలి వానలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది*

*ఏన్కూరు మండలంలో గాలి వానలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది* *కుండపోత వర్షం, బీభత్సమైన ఈదురుగాలులు – అయినా ఆగని విద్యుత్ సిబ్బంది సేవలు* *ప్రాణాలకు తెగించి మరమ్మతులు – చీకట్లో చిరుదీపాలైన లైన్‌మెన్లు* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ *ఏన్కూరు, మే 03:* ఏన్కూరు మండలంలో కుండపోత వర్షంతో పాటు బీభత్సమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి, విద్యుత్ పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే ఈ ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సకాలంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. తెగిపడ్డ వైర్లు మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి తోడు గంటకు 60-80 కి.మీ వేగంతో వీచిన గాలులకు మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో వైర్లు తెగిపోయాయి. దీంతో 20కి పైగా గ్రామాలకు మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఏన్కూరు ఏడి రమేష్ , డిఈ యాసిన్, ఏఈ ఉమా కాంతి లైన్మెన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో లైన్ ఇన్‌స్పెక్టర్ లైన్‌మెన్లు బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు చేపట్టారు. టార్చ్‌లైట్లు, సహాయం తో అర్ధరాత్రి సమయంలోనూ కుండపోత వర్షంలో తడుస్తూ తెగిపడిన వైర్లను అతికించి, ఫాల్ట్‌లను సరిచేశారు. గంటల కొద్ది ఏకధాటిగా శ్రమించిన విద్యుత్ సిబ్బంది కృషి ఫలితంగా మంగళవారం రాత్రి సమయం లోనే గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కరెంట్ వచ్చింది. లైన్‌మెన్ అన్నలు వానలో తడిసి పనిచేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని గ్రామస్తులు తెలిపారు. ఏఈ ఉమా కాంతి మాట్లాడుతూ ‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఏన్కూరు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ప్రజలు కూడా తెగిపడిన వైర్ల జోలికి వెళ్లకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలి’ అని సూచించారు. వర్షం పడుతుంటే కరెంట్ తీగలు పట్టుకోవడం అంటే ప్రాణంతో చెలగాటమే. కానీ గ్రామంలో చిన్న పిల్లలు, వృద్ధులు చీకట్లో ఇబ్బంది పడతారని మేము వెళ్లక తప్పదు. మా కష్టాన్ని ప్రజలు గుర్తిస్తే చాలు’ అని లైన్‌మెన్ శ్రీకాంత్ తెలిపారు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న లైన్‌మెన్లకు పూర్తిస్థాయి భద్రతా పరికరాలు అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

*ఏన్కూరు మండలంలో గాలి వానలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది*

*కుండపోత వర్షం, బీభత్సమైన ఈదురుగాలులు – అయినా ఆగని విద్యుత్ సిబ్బంది సేవలు*

*ప్రాణాలకు తెగించి మరమ్మతులు – చీకట్లో చిరుదీపాలైన లైన్‌మెన్లు*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

*ఏన్కూరు, మే 03:*

ఏన్కూరు మండలంలో కుండపోత వర్షంతో పాటు బీభత్సమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి, విద్యుత్ పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే ఈ ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సకాలంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.

తెగిపడ్డ వైర్లు
మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి తోడు గంటకు 60-80 కి.మీ వేగంతో వీచిన గాలులకు మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో వైర్లు తెగిపోయాయి. దీంతో 20కి పైగా గ్రామాలకు మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విషయం తెలుసుకున్న ఏన్కూరు ఏడి రమేష్ , డిఈ యాసిన్,
ఏఈ ఉమా కాంతి లైన్మెన్ శ్రీకాంత్
ఆధ్వర్యంలో లైన్ ఇన్‌స్పెక్టర్ లైన్‌మెన్లు బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు చేపట్టారు. టార్చ్‌లైట్లు, సహాయం తో అర్ధరాత్రి సమయంలోనూ కుండపోత వర్షంలో తడుస్తూ తెగిపడిన వైర్లను అతికించి, ఫాల్ట్‌లను సరిచేశారు.
గంటల కొద్ది ఏకధాటిగా శ్రమించిన విద్యుత్ సిబ్బంది కృషి ఫలితంగా మంగళవారం రాత్రి సమయం లోనే గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.

కరెంట్ వచ్చింది. లైన్‌మెన్ అన్నలు వానలో తడిసి పనిచేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని గ్రామస్తులు తెలిపారు.

ఏఈ ఉమా కాంతి మాట్లాడుతూ ‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఏన్కూరు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ప్రజలు కూడా తెగిపడిన వైర్ల జోలికి వెళ్లకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలి’ అని సూచించారు.

వర్షం పడుతుంటే కరెంట్ తీగలు పట్టుకోవడం అంటే ప్రాణంతో చెలగాటమే. కానీ గ్రామంలో చిన్న పిల్లలు, వృద్ధులు చీకట్లో ఇబ్బంది పడతారని మేము వెళ్లక తప్పదు. మా కష్టాన్ని ప్రజలు గుర్తిస్తే చాలు’ అని లైన్‌మెన్ శ్రీకాంత్ తెలిపారు

ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న లైన్‌మెన్లకు పూర్తిస్థాయి భద్రతా పరికరాలు అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.