యలమంచిలి, సెప్టెంబర్ 14 – పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:
ఏటికొప్పాక గ్రామంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై ఉపేంద్ర హెచ్చరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఎస్సై ఉపేంద్రతో పాటు పోలీసు సిబ్బంది చురుకుగా పాల్గొని ప్రజలకు పలు సూచనలు, హెచ్చరికలు చేశారు.


