శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలో మహానాడు–2026 వేడుకల సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన నివాసంలో తెలుగుదేశం పార్టీ పసుపు జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పసుపు జెండా కోట్లాది మంది కార్యకర్తల విశ్వాసానికి, ప్రజా సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ప్రజల్లోకి పార్టీ ఆశయాలను తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

మహానాడు వేళ శ్రీకాళహస్తిలో టీడీపీ పసుపు జెండా ఆవిష్కరణ