వేంసూరు / ఖమ్మం
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ వెంసూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వెంసూర్ మండల అధ్యక్షుడు గోర్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగ సురేంద్ర రెడ్డి, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా కార్యాలయ సంయుక్త కార్యదర్శి గొర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, మండల కార్యదర్శి బండి వెంకట రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కిన్నెర మహేష్, కంచర్ల మధన్ మౌళి తదితరులు పాల్గొన్నారు.


