📰 రక్షాబంధన్ వేడుకలు సుజాత నగర్ లో ఘనంగా
సుజాతనగర్ పున్నమి ప్రతి నిది చల్లగుండ్ల నరేష్ ఆగష్టు 27 : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు సంప్రదాయబద్ధంగా రాఖీలు కట్టి, వారి నుదుటన తిలకం దిద్ది, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ కట్టిన అనంతరం సోదరులు తమ సోదరీమణులకు కానుకలు అందించి, జీవితాంతం వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.అక్కా–తమ్ముడు, అన్నా–చెల్లి అనుబంధం జన్మజన్మల బంధానికి ప్రతీక అని, ఈ పవిత్రమైన బంధం ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో కొనసాగాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సిద్విక్ చౌదరి, ధన్విక చౌదరి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. సోదరసోదరీమణుల మధ్య ఉన్న ఆప్యాయతను చాటిచెప్పేలా రాఖీ వేడుకలు ఆనందంగా జరిగాయి.


