తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
తిరుపతి అలిపిరి రోడ్డులోని ఎస్వీబీసీ కార్యాలయంలో నూతనంగా నియమితు లైన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి శ్రీధర్ వర్మ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.సి. మునికృష్ణ పాల్గొని నూతన చైర్మన్ శ్రీధర్ వర్మ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా, గతంలో తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలను, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విషయాన్ని గుర్తిస్తూ శ్రీధర్ వర్మ గారికి జ్ఞాపికను అందజేశారు.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ను మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మరింత చేరువగా తీసుకెళ్లే విధంగా శ్రీధర్ వర్మ సేవలు కొనసాగాలని, ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఆర్.పి. శ్రీనివాసులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, గంజి సుధాకర్ రెడ్డి, జగ్గా రవి, శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నాగ ప్రతాప్, ప్రసాద్, శీను, సుధీర్, ముని దేవాచారి తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


