ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బాలుడు తప్పిపోయాడు
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సురక్షితంగా ఉన్న బాలుడు
ఇబ్రహీంపట్నం: ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఓ బాలుడు తప్పిపోయిన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ బాలుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యులు లేదా అతడిని గుర్తుపట్టిన వారు వెంటనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
బాలుడి ఆచూకీ తెలిసిన వారు లేదా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగలిగిన వారు కింది ఫోన్ నంబర్లలో పోలీసులను సంప్రదించాలి.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్:
📞 8712662419
📞 8712662361
📞 7396217607
బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందేలా ఈ వార్తను వీలైనంత ఎక్కువగా షేర్ చేయాలని పోలీసులు కోరారు.



