అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఈరోజు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏ బి ఆర్ ఎస్ ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి శ్రీ గుంతా లక్ష్మణ్ జి గారు పాల్గొనగా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై వి రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఏ బి ఆర్ ఎస్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డి ఎస్ వి ఎస్ బాలసుబ్రమణ్యం, డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ హరి రామ్ ప్రసాద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుత్త రాజశేఖర్ అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మరియు ఇతర ఉన్నత విద్యాశాఖ అధికారులకు విజ్ఞాపన పత్రాలు పంపించడం జరిగినది. ఈ విజ్ఞాపన పత్రములో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు బదిలీలకు సంబంధించినటువంటి జీవో ని వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రములోని విశ్వవిద్యాలయాల లో ఖాళీగా ఉన్న అధ్యాపకులు పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వీలైనంత తొందరగా అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని, ఈ విద్యా సంవత్సరములో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ,
పీ హెచ్ డి విద్యార్థులు ప్రవేశాలకు వెంటనే చేపట్టాలని, రాష్ట్రములోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో పని గంటలను 9.30 నుంచి 4 వరకు కుదించాలని, జూనియర్ కళాశాల అధ్యాపకులకు డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలని, విశ్వవిద్యాలయాలలో కెరీర్ అడ్వాన్స్డ్ స్కీమ్ పదోన్నతులు సకాలంలో నిర్వహించాలని, రాష్ట్రంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని, పెండింగు లో ఉన్న నాలుగు డిఏ లను వెంటనే విడుదల చేయాలని,ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 3500 అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయాలని పేర్కొనడం జరిగింది.
ఈ సమావేశంలో ఏ బి ఆర్ ఎస్ ఎం రాష్ట్ర నాయకులు డాక్టర్ పద్మావతి, డాక్టర్ అనిత, ప్రొఫెసర్ రామచంద్రన్, ప్రొఫెసర్ వరదరాజన్, శరత్చంద్ర, డాక్టర్ ఎం వి నరసయ్య, డాక్టర్ కిషోర్ కుమార్ మొదలైన వారు పాల్గొన్నారు.



