Saturday, 4 July 2026
  • Home  
  • అరకు: అల్లూరి సీతారామరాజు పోరాటాలు స్పూర్తిదాయకం
- అల్లూరి సీతారామరాజు

అరకు: అల్లూరి సీతారామరాజు పోరాటాలు స్పూర్తిదాయకం

మన్యం ప్రజల హక్కుల రక్షణకు ఆంగ్ల దొరలపై పోరాడిన విప్లవసింహం అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్రను అందరూ తెలుసుకోవాలని అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ అన్నారు. శనివారం అరకులోయ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన అల్లూరి జయంతి సంధర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. ఈ మేరకు అల్లూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగం, సేవాభావం నేటి తరానికి స్పూర్తిదాయకం అని ఆయన అన్నారు. మండల పంచాయితీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది, సీవీఏపీ యూనియన్ సిబ్బంది పాల్లొన్నారు . అలాగే అల్లూరి సీతారామరాజు జయంతిని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ డా కేబీకే నాయక్, డా కుసుమ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పోరాటాలను విద్యార్ధులు చదవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.