అనుమసముద్రం గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది. ఇక్కడి పోలేరమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఈ ప్రాంతంలో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలేరమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజకు శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ అధికారులు సోమవారం భూమి పూజ చేసేందుకు ముగ్గు వేశారు. నాయకులు పులిమి సుధాకర్ రెడ్డి చొరవతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దాతృత్వంతో గుణంతో ఇక్కడ ఆలయ నిర్మాణం జరగనుంది. దశాబ్దాల తరబడి రాళ్లు ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకుంటున్న ఇక్కడి గిరిజనులకు మంత్రి సహకారంతో శాశ్వత ఆలయ నిర్మాణం జరగనుంది. దీంతో ఇక్కడి గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజనులైన తమను గుర్తించి తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, టిడిపి మండల నాయకులు పులిమి సుధాకర్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.



