Friday, 14 August 2026
  • Home  
  • అమర్ జవాన్ స్థూపానికి స్థలం కేటాయించండి: నంద్యాల మాజీ సైనికుల వినతి
- నంద్యాల

అమర్ జవాన్ స్థూపానికి స్థలం కేటాయించండి: నంద్యాల మాజీ సైనికుల వినతి

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకునేందుకు నంద్యాలలో “అమర్ జవాన్” స్థూపం నిర్మాణానికి తగిన స్థలం కేటాయించాలని నంద్యాల ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ, డీఆర్వో, ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్‌లకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.చామకాల్వ సెంటర్‌, పొగాకు కంపెనీ, రైల్వే స్టేషన్‌ వద్ద పోస్టాఫీస్‌, జీవీ మాల్‌, పద్మావతి నగర్‌ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థలాన్ని ప్రకటించి, అమర జవాన్లకు గౌరవం కల్పించాలని అసోసియేషన్‌ అధ్యక్షులు మాజీ హానరరీ సుబేదార్‌ మేజర్‌ ఎన్‌.సి. రంగనాయకులు, ప్రధాన కార్యదర్శి మాజీ నాయబ్‌ సుబేదార్‌ పీహెచ్‌సీ గురువయ్య తదితరులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.