3 వేలు కుక్కలు కనిపించడంలేదని ఆరోపణ.. ఒక్కో కుక్కకు రూ.1,650 చెల్లింపులపై ప్రశ్నలు
అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో వీధి కుక్కల సంరక్షణ, తరలింపు వ్యవహారంపై వివాదం నెలకొంది. సుమారు 3 వేల కుక్కలు కనిపించకుండా పోయాయని జిల్లా వీఎస్పీ నంబర్ శ్రీదేవి ఆరోపించారు. సుంకరమెట్ట జంక్షన్ సమీపంలోని ఏపీఎస్ కేంద్రం సంరక్షణ కేంద్రంలో పట్టుకున్న కుక్కల పరిస్థితిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
కుక్కలను పట్టుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించే ప్రక్రియలో ఒక్కో కుక్కకు రూ.1,650 చొప్పున చెల్లింపులు జరుగుతున్నాయని శ్రీదేవి ఆరోపించారు. గత నెల 4వ తేదీన కుక్కలు మాయమైనట్లు అనకాపల్లి రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు.
అదృశ్యమైన కుక్కలను ఇతర రాష్ట్రాలకు తరలించి మాంసంగా విక్రయిస్తున్నారనే అనుమానాలను కూడా శ్రీదేవి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె కోరారు. కుక్కల సంరక్షణ కేంద్రాల నిర్వహణ, కుక్కల సంఖ్య, తరలింపు వివరాలు, చెల్లింపులపై పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


