ది: 03.09.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అమలాపురం టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దంతో నడుపుతున్న 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి అక్రమంగా అమర్చిన సైలెన్సర్లను తొలగించి, వాటిని ధ్వంసం చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం, నిబంధనలకు విరుద్ధమైన సైలెన్సర్ మార్పులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
— CI, అమలాపురం టౌన్
Uploaded Video:


