Saturday, 5 September 2026
  • Home  
  • నంద్యాలలో ఘనంగా ఇంటర్ జోనల్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం
- నంద్యాల

నంద్యాలలో ఘనంగా ఇంటర్ జోనల్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం

నంద్యాల:మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి ఫయాజ్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఇటీవల అమరావతి క్రీడా పోటీల్లో నంద్యాల ప్లేయర్లు ఒక స్వర్ణం, 4 రజతాలు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం అభినందనీయమని రవి కృష్ణ అన్నారు. త్వరలోనే నంద్యాలలో రాష్ట్రస్థాయి పోటీలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పోటీల్లో కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.