ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సేవలు అందించే సమగ్ర వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు విశాఖపట్నం లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, డిప్యూటీ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి విడతలో మంజూరైన క్రిటికల్ కేర్ సెంటర్లలో అనకాపల్లి కేంద్రాన్ని చేర్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. సుమారు రూ.22.09 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు కాగా, మరో రూ.7.50 కోట్ల విలువైన వైద

అత్యాధునిక వైద్య సేవలకు కేంద్రంగా అనకాపల్లి జిల్లా ఆసుపత్రి..
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సేవలు అందించే సమగ్ర వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు విశాఖపట్నం లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, డిప్యూటీ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి విడతలో మంజూరైన క్రిటికల్ కేర్ సెంటర్లలో అనకాపల్లి కేంద్రాన్ని చేర్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. సుమారు రూ.22.09 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు కాగా, మరో రూ.7.50 కోట్ల విలువైన వైద

