పెద్దపల్లి, సెప్టెంబర్ 03:
నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో జిల్లా స్థాయి ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న శుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 30 పోస్టులను నేరుగా ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మార్కెటింగ్ విభాగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ మేనేజర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా టెలికాలర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్డేటెడ్ రెజ్యూమ్/సీవీ, విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, అనుభవ పత్రాలు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. నిర్ణీత సమయానికి వేదికకు చేరుకుని నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు, పెద్దకల్వలలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూమ్ నంబర్ 233, మొదటి అంతస్తులో ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కోరారు. వివరాలకు 9908674056, 8121262441 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

సెప్టెంబర్ 9న పెద్దపల్లిలో ఉద్యోగ మేళా
పెద్దపల్లి, సెప్టెంబర్ 03: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో జిల్లా స్థాయి ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న శుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 30 పోస్టులను నేరుగా ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మార్కెటింగ్ విభాగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ మేనేజర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా టెలికాలర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్డేటెడ్ రెజ్యూమ్/సీవీ, విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, అనుభవ పత్రాలు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. నిర్ణీత సమయానికి వేదికకు చేరుకుని నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు, పెద్దకల్వలలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూమ్ నంబర్ 233, మొదటి అంతస్తులో ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కోరారు. వివరాలకు 9908674056, 8121262441 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

