*రేపల్లెవాడలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
సర్పంచ్ అజ్మీర్ సురేష్ నాయక్ చేతులమీదుగా 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు
జూన్ 28
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
రేపల్లెవాడ గ్రామంలోని పిల్లల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఆదివారం రేపల్లెవాడ పాఠశాల ప్రాంగణంలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
గ్రామ సర్పంచ్ అజ్మీర్ సురేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి పోలియో చుక్కను స్వయంగా పిల్లలకు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,
“పోలియో రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.
ఇది మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం” అని పిలుపునిచ్చారు.
*గ్రామంలోని అర్హులైన పిల్లలందరికీ చుక్కలు*
కార్యక్రమంలో భాగంగా రేపల్లెవాడ గ్రామంలోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ నాయక్
ఉప సర్పంచ్ కాలంగి వీరభద్రం ఏఎన్ఎం మాలోతు నిర్మల ఆశ కార్యకర్త సామ్రాజ్యం అంగన్వాడీ టీచర్లు జ్యోతి కుమారి మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. పోలియో అనేది శాశ్వత వైకల్యాన్ని కలిగించే ప్రమాదకర వ్యాధి కాబట్టి ప్రతి బిడ్డకు రెండు చుక్కలు తప్పనిసరి అని తెలిపారు.
కార్యక్రమం విజయవంతానికి పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక కృషి చేశారు.

